__పెద్దేముల్ ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్‌గా నల్లా ఎల్లారెడ్డి.. వైస్ చైర్మన్‌గా బొంకూర్ శ్రీనివాస్,
_____ఆరు నెలల్లో డీసీసీబీ బ్రాంచ్ ఏర్పాటుకు కృషి చేస్తా,_____ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి | రైతులకు అండగా ఉంటాం,
హిందు9 న్యూస్ విశ్లేషణ| వార్త వెనుక వాస్తవం,
పెద్దేముల్, అక్టోబర్ 17,
రైతుల అవసరాలకు భరోసా ఇవ్వడం సహకార రంగాన్ని బలోపేతం చేయడం.. స్థానికంగా ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం.. ఇవే పెద్దేముల్ సహకార సొసైటీ ముందున్న ప్రధాన సవాళ్లు. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, ఈ ఆశలు కార్యరూపం దాల్చాలంటే ప్రకటించిన హామీలు ఆచరణలోకి రావాల్సి ఉంది.
పెద్దేముల్ మండల కేంద్రంలోని ఎఫ్ఎస్సీఎస్ (FSCS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. సొసైటీ చైర్మన్‌గా నల్లా ఎల్లారెడ్డి, వైస్ చైర్మన్‌గా బొంకూర్ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్ పి. మైపాల్రెడ్డితో పాటు ఎస్ ఐ ఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తమరావు, ఉత్తమ్ చద్ , నారాయణరెడ్డి, కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మధులత శ్రీనివాస్, లొంక నరసింహులు, డైరెక్టర్లు, తట్టేపల్లి వైస్ చైర్మన్ జగన్ కోటపల్లి మాజీ చైర్మన్ అంజయ్య సర్దార్ ఖాన్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు గోపాల్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, పెద్దేముల్ సీఈఓ మురళి గౌడ్, తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ , ఎంపీడీవో తిరుమల స్వామి,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

____ఆరు నెలల్లో డీసీసీబీ బ్రాంచ్.. ఎమ్మెల్యే హామీ,
పెద్దేముల్ ప్రాంత రైతులు, ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు రాబోయే ఆరు నెలల్లో డీసీసీబీ బ్రాంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రకటించారు. స్థానికంగా బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు రుణాలు, ఇతర ఆర్థిక లావాదేవీల విషయంలో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.
పెద్దేముల్ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఏసీఎస్‌గా మార్చేందుకు కూడా కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం సొసైటీలో సుమారు 6,000 మంది సభ్యులు ఉన్నారని పేర్కొంటూ, రైతులకు ఎల్టీఐ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు బ్యాంకుల ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఆర్థిక సహాయం అందేలా భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
____రైతులకు సేవే లక్ష్యం సొసైటీ అభివృద్ధే ధ్యేయం,
నూతన పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. సొసైటీకి వచ్చే రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, వారి అవసరాలను గుర్తించి సేవలందించాలని కోరారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆరుతడి పంటల సాగు విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు.

___పదేళ్ల పాలనలో ఏం సాధించారు? బీఆర్ఎస్పై ఎమ్మెల్యే ప్రశ్నలు?
కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. తాండూరు నియోజకవర్గంలో గత పదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.
ఎంపీ ఎన్నికల సమయంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో సర్వేల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిప్రాయాన్ని తప్పుగా ప్రతిబింబించే సర్వేలతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడటం సమంజసం కాదని అన్నారు.
గత సర్పంచ్ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడాన్ని ప్రస్తావిస్తూ, ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ నాయకులు ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు.
___రోడ్ల అభివృద్ధిపై హామీలు,. ప్రజలకు ఎదురుచూపులు,
తాండూరు నియోజకవర్గంలో గతంలో రాజకీయ పొత్తుల ప్రభావం ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు లభించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలు తమపై అభివృద్ధి బాధ్యతను ఉంచారని తెలిపారు.
గత పదేళ్లలో రోడ్ల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రోడ్ల పనులను దశలవారీగా చేపడుతున్నామని, అవసరమైన ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్–తాండూరు రహదారి పనులను కూడా పూర్తిస్థాయిలో చేపడతామని తెలిపారు.

___సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు.. సంక్షేమంపై కాంగ్రెస్ ప్రస్తావన,
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుస్తున్నామని పేర్కొన్నారు.
గత పదేళ్ల పాలనలో పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన ఎందుకు రాలేదని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. తాండూరు నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు.
____ఎల్‌నినో ప్రభావం.. ఆరుతడి పంటలపై అప్రమత్తత అవసరం__ధారాసింగ్,
డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగుపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆరుతడి పంటల సాగులో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
కోటపల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సహకారంతో ప్రాజెక్టు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. త్వరలో చిన్న కాలువల మరమ్మతులు కూడా చేపడతామని తెలిపారు.

కాలువల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, నాసిరకం పనులకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధారాసింగ్ స్పష్టం చేశారు. సాగునీటి పనులు సజావుగా సాగేందుకు రైతులు సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సహకారంతో పెద్దేముల్ సహకార సొసైటీని అభివృద్ధి దిశగా నడిపిస్తామని, రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు.
_____రైతుల నమ్మకమే నా బాధ్యత: నల్లా ఎల్లారెడ్డి
నూతన చైర్మన్ నల్లా ఎల్లారెడ్డి మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే సహకారంతో, ఆయన సూచనల మేరకు ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. రైతులందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సొసైటీకి వచ్చే రైతులెవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా, వారి ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. పాలకవర్గంపై రైతులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.
_____ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఏసీఎస్‌గా మార్చాలి: పి. మైపాల్‌రెడ్డి,
తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్ పి. మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ, పెద్దేముల్ ఎఫ్ఎస్సీఎస్ నూతన చైర్మన్ నల్లా ఎల్లారెడ్డి, వైస్ చైర్మన్ బొంకూర్ శ్రీనివాస్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
పెద్దేముల్ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఏసీఎస్‌గా మార్చాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కోరినట్లు వెల్లడించారు. సొసైటీని మరింత అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందించాలంటే ఈ మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు.
మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు దశలవారీగా పూర్తవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్–తాండూరు రహదారి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రస్తావించారు. గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
హామీల నుంచి కార్యాచరణ వరకు.. రైతులు కోరుకునేది అదే!
పెద్దేముల్ ఎఫ్ఎస్సీఎస్కు నూతన పాలకవర్గం ఏర్పడటంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. అయితే, పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఒక ప్రారంభం మాత్రమే. రైతులకు అందే సేవలు, రుణ సదుపాయాలు, సొసైటీ పరిపాలనలో పారదర్శకత, సమస్యల పరిష్కారంలో వేగం వంటి అంశాలే కొత్త పాలకవర్గ పనితీరుకు అసలైన కొలమానం కానున్నాయి.
డీసీసీబీ బ్రాంచ్ ఏర్పాటు, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఏసీఎస్‌గా మార్చడం, రైతులకు రుణ సదుపాయాలు కల్పించడం వంటి హామీలు కార్యరూపం దాల్చితే స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అదే సమయంలో కోటపల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం, చిన్న కాలువల మరమ్మతులు పూర్తయితే సాగునీటి సమస్యల పరిష్కారానికి తోడ్పడే అవకాశం ఉంది.
ఆరు నెలల్లో డీసీసీబీ బ్రాంచ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్న హామీ.. రైతులకు రుణ సదుపాయాల కల్పన.. సొసైటీని పీఏసీఎస్‌గా మార్చే ప్రయత్నం.. ఇవన్నీ రానున్న రోజుల్లో ఎంతవరకు ముందుకు సాగుతాయన్నది కీలకం.
పదవులు మారడం సహజం.. కానీ రైతుల జీవితాల్లో మార్పు రావడమే సహకార వ్యవస్థ విజయానికి అసలైన గుర్తింపు. కొత్త పాలకవర్గం ఆ దిశగా ఎంతవరకు అడుగులు వేస్తుందో వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు సర్పంచులు కార్యకర్తలు సొసైటీ సిబ్బంది పెంటప్ప ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
హిందు9 న్యూస్ | విశ్లేషణ | వార్త వెనుక వాస్తవం
