కార్మిక హక్కులు, చట్టాల రక్షణకై ఐఎఫ్టీయూ (IFTU) ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తాం: సిపిఐ (యంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై. మహేందర్,

హిందు 9న్యూస్ విశ్లేషణ|వార్త వెనుక వాస్తవం,
వికారాబాద్ జిల్లా:
వికారాబాద్ జిల్లాలో కార్మిక హక్కుల రక్షణ, కార్మికులు, రైతులు, మరియు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు ఇప్టూ మరియు సిపిఐ (యంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై. మహేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ‘హిందూ 9 న్యూస్’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

శ్రామిక వర్గాల హక్కులు కాల రాయబడుతున్నాయి,

ప్రస్తుత తరుణంలో శ్రామిక వర్గాల హక్కులు తీవ్రంగా కాలరాయబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరిముఖ్యంగా కార్మిక సమస్యలు, కార్మికులకు సంబంధించిన చట్టాల అమలు, మరియు కార్మిక హక్కుల రక్షణే ధ్యేయంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇలాంటి అనేక జ్వలంత సమస్యలపై క్షేత్రస్థాయిలో రాజీలేని పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఐఎఫ్టీయూ (IFTU – ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్) కార్మిక సంఘాన్ని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసి, విస్తృత పరుస్తామని ఆయన వెల్లడించారు.

 

జిల్లాలోని శ్రామికులకు, రైతులకు న్యూ డెమోక్రసీ మరియు ఐఎఫ్టీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి హక్కుల సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వై. మహేందర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *