రేపు తాండూర్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం, హాజరవుతున్న పిడమర్తి రవి,

0 minutes, 0 seconds Read
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుతూ రేపు అంటే జూన్ 1న తాండూర్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం చర్చ గోష్టి ఉంటుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఈడికి సంజయ్ గౌడ్ తెలిపారు….

హిందు 9 న్యూస్ తాండూర్ :తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశములపై జూన్ 1 ,11 గంటలకు జరిగే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ ఉద్యమ కారులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి హాజరవుతున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈడీగి  సంజయ్ గౌడ్ తెలిపారు.

గంజి మార్గంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా పైన సమావేశం,

ఈ సమావేశం తాండూర్ పట్టణంలోని గంజి మార్గంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా పైన ఉన్న హాలులో 11 గంటలకు జరుగుతుందని ఆదివారం రోజు తాండూరులో సమావేశమై ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

ఉద్యమకారుల మేనిఫెస్టో పై చర్చ గోష్ట, ఒంగోని బై శ్రీనివాస్,

తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఉపాధ్యక్షులు ఒంగోని బై శ్రీనివాస్ మాట్లాడుతూ:– కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పేర్కొన్న ప్రకారం 250 గజాల ఇంటి స్థలం గుర్తింపు కార్డు హెల్త్ కార్డు గౌరవ వేతనంతో పాటు రవాణా సదుపాయాలు తదితర అంశాల పైన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పాల్గొన్న ఉద్యమకారులు హాజరై తమ సలహాలు సూచనలు అందించాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫిరోస్కాన్ శ్రీనివాస్ జిలాని సుదర్శన్ మల్లేశం శివా కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *